Thursday, April 19, 2018

మౌనం మాట్లాడిన వేళ - విన్నర్


                 Poet Mohmd Musthakheem
మౌనం మాట్లాడిన వేళ.....

 విన్నర్: కవి  తొలి పలుకులు ---01

మౌనం ..మాట్లాడిన వేళ..
తీపి చేదు .. జ్ఙాపకాలను నెమరు వేసిన వేళ...
కళ్ళలో ముందు జూస్తున్న సమాజం పోకడలు ..
ఉండబట్టలేక ..రాసుకుంటూ పోయిన ..రాతలు ..
చూడ్డం తప్ప యేమీ చేయలేని
సామాన్యుడను ..
పెన్ను పట్టి వ్రాసే ..వ్రాతగాడిని , మహా అయితే ...
అన్యాయాన్ని ..అక్రమాన్ని ..
గొంతెత్తి పాడే ..గాయకుడను ...

ఈ సమాజం లో ----
యెన్నెన్ని వింతలు ..నేరాలు ..ఘోరాలు , మంచి-చెడ్డలు ...
సమస్యలు ..అరాచకాలు ..
చెప్పలేని ..జాఢ్యాలు ..??
ఒక్కటని యేమి జెప్పను ..చూసిన కళ్ళ తో ..
మౌనంగా చూస్తూ ..మనసులో
మాట్లాడుకున్నాను ..!!
   ఇన్ని నాళ్ళకు ..నా మౌనం..
ఇలా  "అక్షర రూపం"దాల్చి ..
మాట్లాడింది ..!!

నా "మౌనం మాట్లాడిన వేళ"
   యెనలేని ..ఆనందం .. కనీస
మార్పు ఐనా కనిపిస్తుందేమోనని ..ఈ సమాజం లో ..??
 ఆ మార్పు కోసమే ..ఈ రచన ..!!
 
"యెవరికి వారు తీర్చి దిద్దుకుంటూ ..పోతే ..సమూల
మార్పు జరిగి 'సత్సమాజం'
దర్శనమిస్తుందని భావిస్తూ ..
ఆశిస్తూ ..
    ప్రేమ తో ..
మీ ....విన్నర్ (ముహమ్మద్ ముస్తఖీమ్)
🌸🌸🌸🌸🌸🌸🌸

కవి స్వీయానుభవాలు ..
02

  "మౌనం" సాక్షి గా ..

జీవితం లో ..కొన్ని స్నేహాలు , పరిచయాలు ..సంతోషాలతో
మొదలై ..
విషాదాల తో ..వివాదాల తో ..
ఇరువైపుల ..మనసుకు గాయాలతో ..
తీపి -చేదు ..గ్న్యపకాల తో ..
కంటి నుండి ..కన్నీరు తొణికించే ..ఆలోచనల తో ..
మనస్సు చివుక్కుమనే ..
మాటల సంభాషణలతో ..
వికార నవ్వులతో ..
అవమానాలతో ..అగౌరవాలతో
యెల్లకాలం ...రోదించే ఘడియల తో..
వెంటాడే ..విషాద గాథ లతో ..
బాధించే ..బాధలతో ..
చివరకు --"మనోవేదన" లిచ్చి
ముగిశాయి ..!!
         --విన్నర్ .

🌸🌸🌸🌸🌸🌸🌸


కవి వైరాగ్యం ...03

     గ్న్యపకాల ..నీడ

గ్న్యపకాల నీడలో ..ఉన్నాను ..!!
వైఫల్యాల మేడ లో ..ఉన్నాను ..!!
కునుకురాని నిదుర లో ..ఉన్నాను ..!!
కన్నీళ్ళు..నింపుకుని నీకు ..
కనుచూపు మేర లో ..ఉన్నాను ..!!

బాధే సౌఖ్యమనే ..భావన తో
బ్రతుకుతున్నాను ..!!
నడచిన బాట ను మరచి ..కొత్త
తోవ లో వెళుతున్నాను ..!!
చీకటి లో సయితం ..నీ కంటి
వెలుగు సాయం తో ..నడుస్తున్నాను ..!!
కాలిలో ముళ్ళు ..గుచ్చుకున్నా ..రక్తం
చిమ్ముతున్నా ..
    నీ ..నామమే నా ధ్యాసగా ..??
     నీ ..రూపమే నా శ్వాసగా ..??
 చిరునవ్వు ..చిగురాకులా ..!!
  కన్నీరు ..పన్నీరులా ..!!
హృదయాన్ని లాలిస్తూ ..!!
ప్రతి ఉదయాన్ని పరిపాలిస్తూ ..!!

నీ ..పూజ కై బయలుదేరుతున్నా ..!!??
నీ చిరునామా కై ..శోధనలే
చేస్తున్నా ...??!!

కాన  రావా ..కనికరించవా ..??
యెప్పుడైనా ..యేనాడైనా ..??
ఆ క్షణానికై ..నా ప్రాణానికై యెదురు చూస్తున్న ..
కాన రావా ..కనికరించవా ..??
  "యెదురు చూపు" - "యెడారి బ్రతుకు" ఒక్కటయ్యాయి ..నాకు !!??
అందుకే ..నీ గ్న్యపకాల ..నీడలో  ఉన్నాను ..!!??
           -విన్నర్ .

🌸🌸🌸🌸🌸🌸🌸


కవి హృదయం --04

      నేను , కవిని -
  జరుగుతున్న ..అన్యాయాన్ని ,
అక్రమాన్ని ,Musthakheem
, అవినీతిని ..చూడలేనివాణ్ని ..!

యెవ్వరికినీ ..వంతపాడని వాడిని ..!!
నిస్సంకోచంగా ..నిస్సందేహంగా
నిష్కపటంగా ..నిష్కల్మషంగా ..
ఉన్నమాటని , ఉన్నవాస్తవాన్ని
విశ్లేషించేవాణ్ని ..!!

కాసులకు , కానుకలకు , ప్రలోభాలకు ..లొంగనివాడిని ..
నేను ..కవిని ..!!

జాతి , మత , ప్రాంత ..భేద భావాల్ని ..యెరుగని వాడిని ..!!

 నా వాడు ..నీ వాడను పక్షపాతం చూపని వాడిని ..!!
న్యాయాన్ని మాత్రమే ..
సహించేవాణ్ని ..!!
ధర్మాన్ని యెల్లప్పటికీ ...
వాంఛించే వాణ్ని ..!!

 అధర్మాన్ని , అన్యాయాన్ని ,
అక్రమాన్ని ..సమర్థించుట , పొగడుట ..నా చరిత్ర లో
యెన్నడూ ..యెప్పుడూ ..
కానరానిది ..!!!
     పై పై మెరుగులకు ..
     సమాజ చీడ బొంత పురుగు
      ల కు ...
      సలాం చేయని వాణ్ని
      గులాం యెన్నటికీ
      కాని వాణ్ని ..!!
   
      గొంతుకోసినా ..గొంతు
      గొంతు చించుకుని ..
      సత్యాన్నే పలికే వాడిని ..!!
      ప్రాణం పోయినా ..
       ప్రాణం తీసినా ..
       పరమ నిజాన్నే ఒప్పుకునే
       వాడిని ..!!

       నేనున్నా ..పోయినా ..
       నా రచనలు ..
       అజరామరాలై ..నిలిచి
       వుంటాయి ..!!
     
       తరాలెన్ని ..తరిగినా ..
       నవ తరాలెన్ని పెరిగినా ..
       నా వ్యక్తిత్వం..నా
       గొప్పదనం ..నా ఆదర్శం ..
       యెక్కడికీ పోదు ..!!?
     
       గ్రంథాలలో ..నిక్షిప్తమై
       నేను అమరుడనవుతాను
     
   యెందుకంటే -
        నేను "కవి" ని ..!!!!
    జగతిని ..జాగృత పరిచే ..
    రవిని ..!!
🌸🌸🌸🌸🌸🌸


యాది --ఆనందం -05

 రాతిరయ్యింది ..వెన్నెల విరబూసింది ..!!
 చల్లని గాలి ..చల్లని వెన్నల ..
ఓలలాడించింది ..!!
 జ్ఞాపకాల ..రీలు వెనక్కి
తిరిగింది ..!!??

 అమ్మ..అన్నం వెన్న ముద్దలు
 చందమామ ..సుద్దులు
 ఆగిన ..నా  యేడుపులు ..
 కడుపార తిన్న అన్నం ..
 మెతుకులు ..!!

 కంచం కడిగాక ,
 నీళ్ళు తాపించాక ..
 అమ్మ చక్కిలిగింతలు ..
 నా  నవ్వులే ..నవ్వులు
ముసి ..ముసి గా ..!!
 అమ్మ..క్లైమాక్స్ గా మిణిగురు
 లను ..మిణిక్కు నక్షత్రాలను
 చూపించుట ..వెన్ను తట్టి ..
లాలి పాట ..!!
 ఇంతలో ..నిద్దుర ముంచుకు
 రావడం ..
 ఊహ నుంచి ..తేరుకునడం ...??
 ఆనందమే ..ఆనందం..శైశవం ,
 మధురాతి ..మధుర ..బాల్యం
 ఇలా  యాది చేసుకుంటుంటే.!

🌸🌸🌸🌸🌸🌸🌸


"నాన్న "మనసు చల్లన  -06

   ఓ ..నాన్న ..యెంత దూరం
లో ఉన్నా ..
   లేరు మాకెవ్వరు గొప్ప
నీ  కన్నా ..
నీ హృదయమేలే ..వెన్న
చల్లని ..వెన్నెల కన్న చల్లన ..!!
 యెప్పటికైనా ..యేనాటికైనా ..!
 నీవేలే ..మా చందమామ ..!!
 మా బ్రతుకుల్లో వెలుగు
 నింపావులే ..మా ప్రియతమ..!

యెడారి జీవితాన ..పూల బాట
పరచింది ..నీవే ..నీవే ..!!
మాలో ఆత్మస్థైర్యం నింపి
సమాజాన నడిపించింది ..నీవే
నీవే ..!!

మా భ్రాంతిని ..దారం జేసిన
క్రాంతివి ..నీవే ..నీవే ..!!
మా అశాంతిని ..దూరం జేసిన
శాంతివి ..నీవే ..నీవే ..!!

నీ ..పలుకే మాకు ..శాసనం ..!!
సమాజాన..గౌరవ ..ఆసనం ..!!

ఓ ..నాన్న ..యెంత దూరం లో
ఉన్నా ..
నీవు లేని జీవితం లో ..
యేమున్నా ..యెంతున్నా ..
అది ..మాకు మాత్రం ..సున్న ..!!?
🌸🌸🌸🌸🌸


తల్లి-తండ్రి   -07

అనురాగ-బాంధవ్యాలు ..
కలబోసి , దేవుడు సృష్టించాడు
 తల్లీ -తండ్రిని ..!!!

తనయుల కొరకు , తుది శ్వాస
వరకు ..
ఆదరించినను , చీదరించినను
అక్కున చేర్చుకునే ..
 హృదయాన్ని దేవుడు కల్పించాడు ..తల్లీ -తండ్రికి ..!!


ప్రేమించిననూ , ద్వేషించిననూ
తిట్టినూ ..కొట్టిననూ ..
అనుభవించే ..విశాల
హృదయాన్ని దేవుడు , ఇచ్చాడు ..తల్లీ -తండ్రికి ..!!

కష్టాల ..కడలిలో ఉన్ననూ ..
దుఃఖాల ..ఒడి లో ఉన్ననూ ..
సతాయించిననూ ..
అసహ్యించిననూ ..
అలవాటుగా భావించే గొప్ప
మనసుని ..దేవుడు ఇచ్చాడు
తల్లీ -తండ్రికి ..!!

నిస్వార్థ సేవ ..నిస్వార్థ ..ప్రేమ
నిస్వార్థ పాలన ..పోషణ ..
నిస్వార్థ ..జీవితం ...తల్లి దండ్రిది ...!!??
మంచి ..కి మారు పేరు ..
అనురాగ ఆప్యాయతలే ..కోరు
సవినయంగా ..నమస్కారం..!!
వేల , లక్షల , కోట్ల ..అనంత ..
"సాష్టాంగ పాదాభివందనాలు"
నా ..తల్లి -తండ్రికి ..!!!!
🌸🌸🌸🌸🌸

నా  దేశం -08

   నా దేశం , నా జాతి ..నా
నిండు గౌరవం..!!
   జాతిపిత , చాచా నెహ్రూ
వగైరాల సౌరభం ..!!

   దేశమే ..మక్కువ ...!!
స్వదేశమే ..యెక్కువ ..!!
యెందులోనూ కాదు ..తక్కువ !
యెంతకైనా ..తెగువ ..!!!??

దేశమంటే ..భక్తిలే ..!!
దేశమంటే ..శక్తిలే...!!
దేశ మంటే ..భుక్తిలే ..!!
దేశ మంటే ..యుక్తిలే ..!!

భక్తి - శక్తి , భుక్తి - యుక్తులు
కలగలసిన ...
"సంస్కృతి - సంప్రదాయం" ..
నా దేశం ...భారత దేశం ...!!!
🌸🌸🌸🌸🌸🌸


గురు బ్రహ్మ --09

 ఓ ..ఉపాధ్యాయుడా ..ఓ ..
ఉపాధ్యాయుడా ..
 గతం ..గొప్పదనం ..!!
నీ ..గతం గొప్పదనం ..!!
గొప్పదనాన్ని ..మించిన
మంచి తనం ..!!
చేసిన ..సేవకు గుర్తింపే ..
మూలధనం ..!!
ఓ ..ఉపాధ్యాయుడా ..
ఓ ..గురు దేవా ..ఓ ..గురు వర్యా ..!!
భూత , వర్తమాన, భవిష్యత్
లను ..తీర్చి దిద్దే ..మహాశయా

చదువులు యెన్నో ..చదివావు
విద్యార్థులకెంతో ..నేర్పించావు
మనసు పెట్టి ..పనిచేశావు
వయసు భారమైనా ..బాధ్యత
నిర్వర్తించావు ..!!!
ఓ ..ఉపాధ్యాయుడా ..
పని మంచిగా ..చేసే ..
ఉపాధ్యాయుడా ...!!!

గురువుని మించిన ..శిష్యుడైనా ..
చదువు చెప్పింది ..గురువే కదా ??
గురువును ..గుర్తుంచుకోని
శిష్యుడైనా ..మనసు నొచ్చుకోని
మహనీయుడు ..గురువే కదా?
ఓ ..గురువర్యా ..ఓ గురుబ్రహ్మ
గురుకులాల..ఆదివి నీ వయ్యా
   ఓ .."గురు దేవా" ..
సాదర .."నమస్సుమాంజలి" నీకు ...(ఈ ..సందర్భంగా ..నాకు చదువు చెప్పిన గురువులందరికీ ..నమస్సులు ..విన్నర్ )

🌸🌸🌸🌸🌸🌸🌸


ముందరేమో ..మంచి --10


  చూడ చక్కని ..ముఖము ..!
  మోసగాళ్ల ..లోకము ..??!!
   మేకవన్నె ..పులులూ
   తేనె పూసిన ..కత్తులూ ..??!!

   మేకపోతు ..గాంభీర్యం ..!!
   కాళ్ళు కదపని ..వైనం..!!??
   మనసులో మాలిన్యం ..
   మాటలో   మాధుర్యం ..??!!
   లోకం తీరు ..చూడ వయా ..
   తస్మాత్ ..జాగ్రత్త గా ..
   వుండడం నేర్చుకోవయా ..!!?

   ముందు మంచిగా పలికే
     మూతులు ..!!
  వెనుకేమో ..తీసేను
     గోతులు  ..!!
  ముందరేమో ..కులికే
    కులుకులు ..!!
  వెనకేమో ..యేడుపులే
    యేడుపులు ..!!

  పూట పూటకు ..ఘడియ
    ఘడియ కు మాట
  మార్చే ..వైనం ..!!??

  అర్థం కాని ..అర్థం లేని
    వ్యవహారం..!!
 పరికించి ..చూస్తే
    విషయ శూన్యం..!!??

ఇదే ..నేటి కాలపు ..
    "లోక జ్ఞానం"
🌸🌸🌸🌸🌸

లోకం -రీతి -- 11

  మనిషి  జీవితం -
    లేని దాని కై ..తపన ..
    ఉన్న దానితో ..యాతన ..
    అన్నీవున్నా ..విచిత్ర భావన

    మదికి కొంగ్రొత్త కై లాలన ..
    కోరికలు ..నెరవేరక ,
    మది అనుభవించే ..
    నరక యాతన

    మనిషికి యెనలేని ..
     కోరికలు ...
    కానరాని ...తీరికలు ..
    యెల్ల వేళ లా ..
    పరులతో ..పోలికలు ..

  మనిషికి --
    తన కన్నా ..పరులు
    బాగుండకూదదు ..!!???
   బాగున్నా ..
     తన కన్నా ..బాగుండకూడదు ..??!!
    నవ్వినా ..ఫర్లేదు ..
 తన పై ..యేడవ కూడదు ..??
  "లోకం రీతి" చూడండి ..!!
ఆశ్చర్యం..కలగక మానదు ..??
🌸🌸🌸🌸🌸🌸


మనిషి ని ..మరచిన వేళ --12

   నీ బ్రతుకు నీది ..నా బ్రతుకు
   నాది ..
   యెవరి బ్రతుకు వారిది ..
   ఈ లోకం లో ..!!
   నీ బాధ నీది ..నా బాధ
   నాది ...
   యెవరి గాథ వారిది ..
   ఈ శోకం లో ..!!

    నీ దారి నీది ..నా దారి
    నాది ..
    యెవరి దారి వారిది ..
    ఈ లోకం ..!!

    మనిషి ..మనిషిని ..
    మరచిన వేళ ..!!
    మానవత్వమే ..
    మరచిన వేళ ..!!

    మనిషి ..మనిషిని ..
    కరచిన వేళ ..!!
    దానత్వమే ..
    పరచిన వేళ ..!!

ఒకరి కొకరు ..శత్రువులై ..
మసలిన వేళ ..!!
రక్తపుటేరులై ..ప్రవహించిన వేళ

 నీ మాట ..నీది ..
 నా మాట ..నాది ..
ఈ ..లోకం లో ..!!?
🌸🌸🌸🌸🌸


మరచి పోయారా --13

మరలి పోయారా ..
తరలి  పోయారా ..??
మరచి పోయారా ..
మనసు విరిచి ..పోయారా ..??

కని పెంచిన తలిదండ్రిని ..
మరచి పోయారా ..??
కన్నీరే కడకు మిగిల్చి
దూరమయ్యారా ..??

తల్లి దండ్రులు ..బిడ్డల కిలా
భారమయ్యారా ..??
బిడ్డలున్నతల్లి దండ్రులిలా
అనాథలయ్యారా ..??

గుర్తెరగని వారిలా ..
గుర్తింపు కోల్పోయిన వారిలా ..
అనాధాశ్రయాలకు ..
వృధ్ధాశ్రమాలకు ..మరలి
పోయారా ..??
స్వంత ..గూడు వీడి పోయారా ..??

తల్లి దండ్రుల ..మది లోతులు
మౌన రోదనలు ..
యెవ్వరైనా ..చూశారా ..??

ఈ వింత చూశారా ..?
ఈ చింత ఒప్పుకుంటారా ..??
కని , పెంచి , పోషించిన -
అమ్మా -నాన్న ల ను
ఇలా ..దూరం చేశారా ..??
ఈ పని ..మంచిదంటారా ..??
మరచి పోయారా ...
తనయులారా ..??
తలిదండ్రిని ..విడిచి పోయారా ..??

పండుగ -పబ్బాలకే ..
వస్తారా ..?
అతిథులయ్యారా ..??
అప్పుడెప్పుడో ..వస్తారా ..??
గర్జు ..తీరినట్టు ..??
🌸🌸🌸🌸🌸🌸


వ్యర్థం ..వ్యర్థం --14

కష్టాలలో కనీసం ..
పనికి రాని స్నేహం
కన్నీళ్ళ లో ..
పాలుపంచుకోని బంధుత్వం

ఆపత్సమయంలో ..ఆదుకోని
సోదరత్వం
దుఃఖాలలో ..దూరంగా నుండే
ఊరిజనం

వృధ్ధాప్యం లో ..ఛీదరించుకునే
సంతానం
అనారోగ్యం లో ..
పట్టించుకునని భాగస్వామ్యం

ఆదరణ కు నోచుకోని ..జీవితం
దుఃఖాలే ..దుఃఖాలు
అలుముకున్న ..జీవితం
సుఖాలెప్పుడూ ..సుదూరంగా
నుండే ..జీవితం

అశాంతి ..అలజడులు
నింపుకున్న ..జీవితం
కలతలు ..నిండిన
నిదుర లేని రాత్రులున్న..జీవితం

"నా" అన్న వారు ..యెవ్వరూ
లేని ...జీవితం
బ్రతుకులో ..ఆనందం ..
కరవైన..జీవితం ..
విషాదం..కన్నీళ్ళ తో
భారమైన ..జీవితం ..

వ్యర్ధం..వ్యర్ధం..వ్యర్థం ..!!
🌸🌸🌸🌸🌸



బతుకు చిత్రం -భళావిచిత్రం
-15


పూట గడవని ..బతుకు ఒకనిది ..
పూట గడచినా ..వేదనా
భరితం ఇంకొకనిది ..
కడుపు మాడి ..అల్లాడిపోయే
ప్రాణం ..
హాయిగా , ఖుషీగా ..
ఉండనీయని ..బీదరికం ..!!

దయజూపని ..లోకం
యెన్నడు తీరును ..శోకం ???

రోదించే కళ్ళకు ..కునుకెక్కడ..?
నిదురే ..లేనప్పుడు ,
తీయని ..కలలెక్కడ ..??

ఫుట్పాత్ బతుకులకు ..
ఫుడ్ యెక్కడ ..??
రోడ్డే పరుపైన జీవితాలకు
మెత్తని బెడ్ యెక్కడ ..??

యెప్పుడొస్తుందో ..యేమో ఆ
'విప్లవం'...??
యెటు జూసినా ...ఆనందం ..
ఆ బీద సాదల ..కళ్ళల్లో
నిజమైన ..ఆనందం ..???!!!
ఆ .."శుభపరిణామం"..కోసం
యెదురు చూస్తున్నాయి ..
నా  కళ్ళు ..!!!!

ఆ ..పొద్దుకోసం ..
ఆ ..ఉషోదయం కోసం ..
యెనలేని"యెదురు చూపులు "
నాకు ..
నా ..కళ్ళకు ..
వేయి ..ఆశలతో ..
కోటి ..కాంతులతో ..
🌸🌸🌸🌸🌸🌸🌸


గుణపాఠం -గుర్తుండేపాఠం -16

యెవరో ..వస్తారని ..
యేదో ..చేస్తారని ..
భ్రమపడి -
  'జీవితం'  యెంతో గాయపడింది ..!!

ఆశకు ..పోతే ..నిరాశల
మబ్బులే కమ్మాయి ..!!
యెదురు చూస్తూ ..
కూర్చుంటే .."యెదురు దెబ్బలే "
తగిలాయి ..!!

యెంతో ..విలువైన సమయం
కొవ్వత్తి లా ..కరిగి పోయింది ..!
వెలుతురు కై ..వెదికితే
చిమ్మ చీకట్లు ..ఆలింగనం
చేశాయి ..!!

నమ్మినవాడు ..నట్టేట ముంచుతాడని ..మరో మారు
ఋజువైంది ,
జీవన గమనం లో ...!!?

స్వీయ కార్యాల ద్వారానే ..
గుండె నిండిన ఆత్మ విశ్వాసం..
అకుంఠిత దీక్ష , అచంచల
నమ్మకం , రగిలే కోరిక , మండుతున్న ..ఆశా జ్యోతి ..
ల తోనే .."విజయ ద్వారం"
తెరుచుకుంటుందని ..
నా అనుభవం ద్వార తెలిసి
వచ్చింది ..!!
"శ్రమను  మించిన ఆయుధం
లేదనే " గుణ పాఠం యెల్లప్పుడు  గుర్తుంటుంది .

🌸🌸🌸🌸🌸

 --17

యెందుకోయీ ..యెందుకోయీ
జీవితమంటే విరక్తి ..??
యేమిటీ ..పరిస్థితి ..
యెందుకోయీ ..దుస్థితి ..??

గెలువలేమని, గెలుపులేదని ..?
బ్రతుకులేదని , బ్రతక లేమని..?
బ్రతుకు ..సాగదనీ ..???
యేమి ..ఆ కన్నీరు ..
యేమి ..ఆ నిరాశ ..??

విషం తాగి , ఉరి వేసుకొని ..
బావి లో దూకి ..ఒళ్ళు
కాల్చుకొని ..

స్వీయ శిక్ష  వేసుకొని మరీ ..

ఆనందం లేదని , బాదరబందీ
వద్దని ..
కలహాలతో ..కవ్వింపులతో ..
దుష్టహంకారాలతో ..
కష్టమొచ్చిందనీ ..
నష్టమొచ్చిందనీ ..
అప్పులు పెరిగాయని ..
ముప్పులు కలిగాయని ..

జీవితమంటే ..అన్నీ వుండాలని
యే లోటు ..లేకపోవడమని ..
భ్రమ -భ్రాంతి కాకపోతే మరీను ..??

సమస్యలు -సాధనలు ..
ఉన్నదే ..జీవితం!!!??
మనసుంటే ..మార్గమున్నది ..?
గ్రహించవోయి ..గమనించ వోయి ...!!
జీవితం ను ఆనందం తో ..
సాగించ వోయీ ..??!!
గుండె నిబ్బరంతో ..నిండుగా
జీవనం ..దొరలించవోయీ ..??!
🌸🌸🌸🌸🌸🌸

పుష్ప చరితం -పునీతం -18

ఒక..పువ్వు పుట్టింది ..దాని
జన్మ  ధన్యమైంది ..!!
రంగు రంగులతో ..అందరినీ
అలరించింది ..!!
నిత్యం పుష్పిస్తు ..సువాసనలు
సుగంధాలు ..వెదజల్లింది ..!!
తుమ్మెదల కోసం ..మకరందం
సిధ్ధం చేసింది ..!!


ఈ ప్రకృతిని ..తన
అంద-చందాల తో ..
సుకుమార..తీగల వంపులతో
సుందర ..ఆకుపచ్చని ..
ఆకులతో ..!!!

చూపరుల హృదయాలను ..
అమాంతం గెలిచింది ..!!!

మనుష్యుల ప్రతి ..సంతోషం లోనూ
ప్రతి బాధలోనూ ..
పాలు పంచుకుంది ..!!!

బ్రతుకు ..లోను
చావు ..లోను
హారాల , దండల ..రూపం
దాల్చిన గొప్ప ఘనత పుష్పానిది ..!!!??


ఆ దేవుడికి సైతం ..
ప్రీతిపాత్రయింది ..!!
పుష్పాభిషేకమై ..
పులకించిపోయింది ..!!

వాడిపోయినా ..కొమ్మను
వీడి పోయినా ..
యెండిపోయినా ..
యెండకు మండి పోయినా ..
అనునిత్యం ..తన వారసులను
అందిస్తూనే ..వున్నది !!
పుష్పిస్తూనే ..వున్నది !!

పుష్పచరితం ..అమరం ..
అజరామరం..!!!

గాయాలెన్ని ..ఉన్నా ..
నవ్వు ..చిరు నవ్వూ ..
దీని ప్రత్యేకత ..
మనిషి సైతం ..నేర్చుకోవాల్సిందే..??!!

🌸🌸🌸🌸🌸🌸

యాంత్రిక ..జీవనం --19

సంపాదన ..సంసారం ..
ఇదేనా జీవితం ..??
భార్య , పిల్లలు -జల్లలూ ..
అనుకోవడమేనా ..జీవితం ..??

యెంత సేపూ ..
తినడం-త్రాగడం ..??
నిద్ర పోవడం ..!
నిద్ర లేవడం ..!
ఇదేనా ..నిత్య దిన చర్యం..??

యెలాంటి అనుభూతులు
లేని ..యాంత్రిక జీవనం ..!!?
ఆనందం , సంతోషం ..
యెరగని ..జీవితం ..!!??
బాధ్యతల నడుమ
కూరుకు పోయిన ..
బాంధవ్యాల వలలో
చిక్కుకున్న ..
జీవనం ..

మానసికానందం..లేని
జీవితం ..!!
నిరాశా నిస్పృహల ..
జీవితం ..!!
బాధల ..గాథలతో ..నిండిన
జీవితం ..!!

' కొసరు 'లా ..మారాల్సిన
జీవితం ..
 'యెసరు ' లా మారిన
వైనం ..??

యాంత్రికత ..నిండిన
జీవితం ..!!
ఆనందోత్సాహాల ఊసే
మరచిన ..జీవితం ..!!

ఆనందం ..సంతోషం లతో ..
కూడిన బతుకే బతుకు ..!!!
జీవన మాధుర్యం ..
జీవితానందం ..
  " జీవించే విధానం " లో ..!!??
🌸🌸🌸🌸🌸

వాన జల్లు -20

జల్లు కురిసింది ..
ఇల్లు తడిసింది..
ముసిరిన వాన మబ్బు ..
భారీ..గ కురిసింది ..!!!

ధరియిత్రి ..పులకించి
మట్టి సువాసన ..సర్వం
వ్యాపింప జేసింది ..!!!
మట్టి గంధం ..మంచి గంధం లా
మదిలోని ..యెదారు ను
కట్టివేసింది ..!!!

చేను పనులకై ..పొద్దు
ముద్దు గ యెదురు చూసింది ..!
యెద్దు , నాగలి , యెద్దు ల
బండి ..రా ..రమ్మని పిలిచింది !

పొలం ..పనులు ..
హలం ..పనులు ..
చద్దన్నం ..మూటలు
మధుర ..మనోహర మాటలు
పొలం ..మాటున
హలం ..చాటున ..పాటలు
సంతృప్త జీవనం ..
సంతోష జీవితం ..!!!
ఇదే ..ఇదే ..
జీవిత మకరందం ..
జీవన మాధుర్యం ..!!!?
🌸🌸🌸🌸🌸🌸

గాన  కోకిల -21

రంగు నలుపే అయినా ..
రాగం అద్భుతం ..!!
మది పులకింప జేసే ..
గాన మాధుర్యం ..!!

ప్రకృతి రాణి పరవశించి ..
పూలతో అభిషేకం చేస్తోంది
ఆ ..మధుర , సుమధుర
తేనెలూరు ..గాన కళ కు ..!!!

తరులు -గిరులు , తన్మయత్వం
చెంది ..
చల్లని గాలుల ..తెరలు
దించుతున్నాయి ..
ఆ గాన పారవశ్యానికి ..!!!

మనిషిలో సయితం ..
రంగు -రూపు కాదు చూడాల్సింది ..??
అంతరంగం ..
ప్రతిభ ..
ప్రజ్ఞ..
మంచిని ..మాత్రమే

"ప్రతిభా సామర్థ్యమే"
అసలు సిసలు ..రంగూ-రూపు
భౌతికం కన్నా మానసికం మిన్న
పై పై ..మెరుగులు ..
సబ్బు నీటి ..నురుగులు ..
శాశ్వతం కాని ...ఉరుకులు ..
మానవత్వం ..చరిత్ర లో
శాశ్వితం..!!

యెవ్వరినీ .."చిన్న చూపు"
చూడవద్దనే సందేశం ఇస్తున్నట్లు ఉంది ...నల్లని
గానకోకిల ..కుహూమనే గానం
 గ్రహించితివా ..ఓ ..మానవా ..?
🌸🌸🌸🌸🌸🌸🌸🌸

విజేతగా -విజయుడిగా -22

రాదు ..రాదనుకుంటూపోతే
యే ..పనీ రాకుండా పోతుంది ..!!?

చల్లని ..వెన్నెలనిచ్చే ఆ జాబిల్లి
కారు మేఘాలను ..చీల్చుకుని
బయటకు నవ్వుతూ ..చిరు
నవ్వు తో వెలుగు నివ్వడం
లేదా ..??
కాదు ..కాదనుకుంటూ ..పోతే
యే ..పనీ -పాట కాకుండా
పోతుంది ..??!!

ఆరని అగ్నిజ్వాలల ..తో
ఆ ఉదయ భానుడు ..
అలసట తెలియక ..
జగతిని ..మేలుకోల్పుతూ ..
ఉషోదయాన్నివ్వటం..లేదా ..?

రాత్రి ..చిమ్మ చీకట్లలో ..
చిక్కుకున్నా ..
నక్షత్రాలు ..చిన్నవైనా తమ
మిణుక్కులతో ..చీకటి నలు
మూలలనూ ..పారద్రోలటం లేదా ..??!!

అలసత్వం ..వీడి
ఉత్సాహం..తోడి
ధైర్యం -స్థైర్యం ..కూడబెట్టి
దైన్యం -హైన్యం ..విడిచి పెట్టి
జీవన పథాన ..పయనించు..
గమ్యాన శయనించు..
 తదుపరి ..
కనిపించు ..కనిపించు ..
     "విజేత" గా ..!!?
   విజయుడిగ..
పట్టువదలని ..విక్రమార్కుడి గా

ఓ ..మనిషీ
విజేత  గా జీవించు ..
విజేత  గా మరణించు ..
 చరిత్ర ..సృష్టించు ..
చరిత్ర ..గా మిగిలిపో..!!??
🌸🌸🌸🌸🌸🌸🌸

మనిషి లో దేవుడు -23

ఆకలిమంటల ..
అలమటింపులూ ..
అగత్యపరుల ..బాధలు ..
గాథలూ ..

పట్టించుకునే ..నాథుడేదీ ..??
చూసే వాడేదీ ..??
యేదీ ..యెక్కడ ..??
కళ్ళకు ..కాన రాడే ..??

చూసీ ..చూడనట్లుండే ..వాడే
యెప్పుడైనా ..యెక్కడైనా ..??

దేవుడి హుండీ లో ..
లక్షలు , కోట్లు ..బంగారం..
కుమ్మరిస్తారు ..!!??
అదే ..నడచి వచ్చిన దారికిరువైపులా ..ఉన్న
భిక్షకులకు , యాచకులకు ,
అనాధలకు , అభాగ్యులకు ..
బీద సాదల కు ..
ఒక్కటంటే ..ఒక్క రుపాయ
ఇవ్వడానికి ..కూడ
వెనుకాడతారు ..??!!!!

చాల సందర్భాల్లో ..అస్సలు
పట్టించుకునే ..పాపానికి పోరు ..??!!
ఇంకా ..ఛీ ..కొడతారు ..

ఆ .."యాచించే వాడి రూపం"
లో .."దేవుడు" ఉన్నాడేమో ..?
నన్న ..సందేహమే రాదు ..??
యేమో ..
భక్తుణ్ణి పరీక్షించడానికి దేవుడు
యే రూపంలో వస్తుంటాడో నన్న ..స్పృహ , జ్ఞానమే ..
ఉండదు ..!!?

మనిషి లో నున్న  దైవం ను
ముందు ..గుర్తించాలి ..!!?
పరుల బాధల్లో ..పాలు
పంచుకోవాలి ..!!?

మానవత్వమే ..మతం
పరోపకారమే ..విశ్వాసం
సహాయ గుణమే ..భక్తి
ఇవి ఉంటే ..మనిషి లో
"దేవుడు" ఉన్నట్లే ..!!!?
🌸🌸🌸🌸🌸🌸🌸🌸

రక్తానుబంధం-24

రక్తం విలువ ..యేఏమిటో ..?
నిను గన్న ..వారిని చూసి
తెలుసుకో ..??!!

ఐదున్నర ..లీటర్ల రక్తం ..
నీ ఒంట్లో ప్రవహిస్తోంది ..
యెప్పుడైనా ..ఆలోచించావా
ఇంత రక్తమాని ..????

మరి ..
ఆ రక్త దాతలు ..
ఆ రక్త సంబంధీకులు ..
నిను గన్న ..నీ వాళ్ళు
నీ ..తల్లిదంద్రులని ..
వారిని ..యెన్నడయినా ..
యెప్పుడయినా ..గుర్తు
చేసుకున్నావా ..??

నెమరు వేసుకున్నావా ..మరి
ఆ ..రక్తానుబంధాన్ని ..??
ఆ ..రక్త సంబంధాన్ని ..??
ఆ ..రక్త ఋణానుబంధాన్ని ..?
మనస్ఫూర్తిగ ..గుండెల మీద
చేయి వేసి ..చెప్పు ..?
నిజాన్ని ..ఒప్పుకో ..!!?

 భార్యా బిడ్డలనే ..సంసారం లో
పడి ..
బ్రతుకు దెరువు లో పడి ..
పనుల్లో ..పడి ..
రక్త సంబంధీకులు అయిన
"అమ్మా -నాన్న" ను మర్చి
పోయావు ..??

అప్పడప్పుడు ..గుర్తు చేసుకోవాలి .".రక్తం " ఉడికించుకోవాలి ..
"రక్తసంబంధం " మరపులోకి రాదు ..!!?
అమ్మా -నాన్నల విలువ
గుర్తెరిగి ..మసలు కోవాలి ..
అమ్మా నాన్న లు ...
ప్రత్యక్ష దైవాలు ..!!!
🌸🌸🌸🌸🌸🌸🌸

..పాఠం -ఓ ఆదర్శం -25


చల్లని గాలి లాంటి ..ఓ
 మృదుత్వం ..!!
తీయని తేనె లాంటి ..ఓ
తీయదనం ..!!

పూల వోలె ..ఓ
కోమలత్వం..!!
వెన్నెల వోలె ..ఓ
చల్లదనం ..!!

కొమ్మల వలె ..ఒక
మర్యద గుణం ..!!
ఆకుల వలె ..ఒక
నిండు గుణం ..!!

కోకిల వంటి ..ఒక
మధుర గాత్రం ..!!
కాకి లాంటి ..ఒక
సడలని ఐకమత్యం ..!!

చిలుక లాంటి ..ఒక
ముచ్చటైన ..పలుకు ..!!
పావురం లాంటి ..ఒక
మచ్చ యెరగని ..తెలుపు ..!!


చేప ..లాంటి   స్వదేశ భక్తి ..!!
ఉడుము..లాంటి  సడలని శక్తి !
చీమ లాంటి ..భావి యుక్తి !!

అబ్బో ..
నేర్చుకోవాలే ..గాని ,
మదిలో చేర్చుకోవాలే ..గాని ??
ప్రకృతి లోని ..
ప్రతి దృశ్యం ..ఓ కావ్యం ,
ఓ  అలంకరణ , ఓ కనువిందు ,
ఓ పాఠం , ఓ ఆదర్శం ,
ఓ ప్రేరణ , ఓ అనుకరణ , ఓ
అనుసరణ , ఓ అనుభవం అనుభూతి ...
ప్రకృతి మనకు ..గురువూ ..
మార్గ నిర్దేశకూడు ..
దాన్ని కాపాడు కోవాలి ..!!??
🌸🌸🌸🌸🌸🌸

ఉత్తమం -26


మాట కరవైన చోట ..
మౌనమే ..ఉత్తమం !!
కోపం  కట్టలైన చోట ..
శాంతమే ..ఉత్తమం !!

మది బరువైన చోట ..
రోదనే ..ఉత్తమం !!
పచ్చగడ్డి భస్మమయ్యే చోట ..
సర్దుబాటే ..ఉత్తమం!!

పొద్దు పొడిచిన చోట..
లేలేత కిరాణాలే ..ఉత్తమం!!
రాతిరి రంగరించిన చోట ..
కమ్మని నిదురనే ..ఉత్తమం!!

శత్రుత్వం ఉన్నచోట ..
కరచాలనమే ..ఉత్తమం!!
స్నేహం  ఉన్న చోట ..
నమ్మకమే ..ఉత్తమం!!

సమస్యలున్న చోట ..
సంయమనం , సామరస్యము
ఉత్తమం!!
రక్తపాతమున్న  చోట ..
నిండు ధైర్యమే ..ఉత్తమం!!


మేఘాలు ..మాటు వేసిన
చోట ..
వర్షించడమే ..ఉత్తమం!!
పైర గాలి ..తాకిన చోట
మది ఊహలే ..ఉత్తమం!!

అందమైన శిల్పమున్న చోట
శిల్పి ..ప్రతిభనే ..ఉత్తమం!!
రంగు రంగుల పిచ్చుకలు
ఉన్న చోట ..వాటి
సవ్వడే ..ఉత్తమం!!

గజ్జె ఘల్లుమన్న ..చోట
మయూరమే ..ఉత్తమం!!
వీణ మ్రోగిన ..చోట
మధుర గానాలాపనే ..ఉత్తమం

🌸🌸🌸🌸🌸🌸🌸

జనన -మరణాలు -27

పుట్టుక ..యెంత సహజమో ..?
గిట్టుక ..కూడ అంతే సహజం?

జనన -మరణాలు ..
లేనిది ..యేది ..??
రాయి లాంటి బండరాయి
సైతం ..కాల గమనం లో
ఇసుక లా మారి పోతుంది ..??

చెట్టూ-చేమ కూడ ..పుట్టి
పెరిగి ..నశిస్తుంది ..??

యే ..జీవి , యే ..ప్రాణి ..
పుట్టుక నించి గాని ,
చావు  నించి  గాని ,
తప్పించుకునే  ..సాహసం
చేయ లేక పోయింది ..!!?

దేవుని సృష్టి లో ..
"జననం-మరణం"  లు
ప్రాధాన్యం సంతరించుకున్నాయి ..!!
పుట్టిన రోజుని ..సంతోషం గా ..
చావు ని ..దుర్దినం గా ..
జరుపు కుంటాం..??!!

పుట్టుక ..ఇష్టం
గిట్టుక ..కష్టం
యెంతైనా ..మానవ
స్వాభావం ఇది ..
సహజం ..సహజం ..!!?

మనిషి ..యెక్కడి నుండి
వచ్చాడు ..??
యెక్కడికీ ..పోతాడు ..??
ఇవి అర్థం గాని ..
సమాధానం ..సరిగ్గా ..
పరిపూర్ణం గా ..
లభించని .".దివ్య"విషయాలై
కూర్చున్నాయి ..!!??

అందుకే ..
చేయాల్సింది ..జీవించడం
చావొచ్చినప్పుడు..దాన్ని
స్వీకరించడం ..
అంతే ..మరు మార్గం ..లేదు ??
🌸🌸🌸🌸🌸🌸

గర్జుకో ..నమస్కారం -28

ఆఁ ..అవసరం ..కొద్దీ
ఓ ..నమస్కారం ..
ఇదే ..మన సంస్కారం ..!!??

గౌరంవం, సభ్యత -సంస్కారం
లకు ..నమస్కారం
గతించిన కాలపు -
వైభవం , జ్ఞాపకం ..గుర్తుగా
మిగిలింది ..!!?

స్వార్థపరత్వం..నిండుకున్న
మనసులున్న , మనుష్యులున్న
నేటి ..కాలం లో -
 " నమస్కారం " ఓ ..అవసరాలు తీర్చే వస్తువయింది ..
ఈ  "వస్తువు" యెలాంటిదంటే?
ఈ వస్తువు "తయారీ తుది గడువు "
అంటే -"అవసరం" తీరగానే
ముగిసి పోతుంది ..!!

అంత దాక ఉన్న పరిచయం ..
కాస్త ..అపరిచయం గా ,
యెవరో నన్నట్లు..తెలియనితనం గా
రూపు దిద్దుకుంటుంది ..!!??

గర్జు ..కో నమస్కారం..?
గర్జు ..తీరగానే తిరస్కారం ..!!?
ఇదే ..నేటి కాలపు ..సంస్కారం
అర్థం కాని ..
అర్థం లేని .. కువ్యవహారం..!!?
గర్జు కో నమస్కారం..
గర్జుకో ..సలాం
వద్దయ్యా ..వద్దు ..
ఇలాంటి పనికి మాలిన ..కామ్?
🌸🌸🌸🌸🌸🌸

జీవిత భాగస్వామి -29

జీవితాన్ని పంచుకున్న ..
జీవిత భాగస్వామి ..!!
కట్టుకున్న వాడి ..తోడూ -నీడగ
నడక సాగించే ..
సహ ధర్మచారిణి ..!!!

బయటి బాధలతో ..భారమైన
భర్త మనసుని ..తెలుసుకుని
మసిలే ..అనురాగ దేవత ..!!

తన చిరు నవ్వుల తోటి ..
క్షణం లో అతని బాధని ..
తన సంతోషం గా..
మార్చే  కల్పవల్లి ..!!

భర్త , పిల్లల , అత్తగారింటి
ఆరళ్ళను ..వేధింపులను ..
గృహ హింస ల సాగరాల ను
అవలీలగా ..దాటవేసే ..
ధైర్య లక్ష్మి ..!!


కుటుంబ గౌరవం..తన
గౌరవమని ..తలుస్తూ
యెన్నో దుఃఖాలని ...
భరిస్తూ ..సహిస్తూ ..
"సంసారనౌక" ను సంభాళించుకుంటూ ..
ముందుకి సాగే -
"మంచి మహిళ ",
 "మంచి గృహిణి ",
  మంచి అమ్మ ..లాంటి
 "భార్యామణి" ...!!!?
🌸🌸🌸🌸🌸🌸🌸🌸

గాలి మాటలు -30

కాలం ..పోక , అర్థం గాక ..
ఊరకుండేటోల్లకు ..
ఉబుసుపోక కబుర్లు ..!!

వీరి ..గురించి , వారి ..గురించీ
చాడీలు ..గాలి మాటలు ..!!
ఈ గాలి ..మాటలే
రేపేను ..మంటలు ..??

గాలి ద్వారానే ..ఈ చెవికి
ఆ ..చెవికి చేరతాయి ..
దుమారం ..రేపుతాయి ..
దూరం ..పెంచుతాయి ...
మనుష్యుల నడుమ వైరాన్ని
అల్లకల్లోలాన్ని ..సృష్టించి
జీవితాలను ..భస్మం చేస్తాయి!

గాలివాటం లా ..ఊరంతా ..
అందరి చెవులకు ..
చేరకనే చేరుతాయి ..!!??

నిజం ..యెంత ఉంటుందో ఏమో ..గాని ..??
ఐనా .."నిజం" నిప్పు లాంటిది మరి ..??
అబధ్ధం ..అడాల్సిన అవసరం
కూడ లేదు , మరి ..??

ఐనా ..గాలి మాటల్లో వాస్తవాలేమో , గాని
భ్రమ , ఈర్ష్య , జెలసీ , ఇత్యాదివన్నీ ..ఉండొచ్చు ??

"నిజానిజాలు" తెలుసుకునే
ప్రయత్నం ..చేయాలి ..??!!
అప్పుడు గాని , ఓ నిర్ణయానికి
రాకూడదు ..??!
ఐనా , గాని " గాలిమాటలు"
మహా చెడ్డవి .".పరనింద " ని
ప్రేరేపించేవి..??!

కారణ జన్మ -31

మనిషివై ..పుట్టినందుకు
మానవత్వం ఉండడం
తేనె తెట్టు లో ..తేనె
ఉండడం తో సమానం ..!!

మనిషివై ..జీవిస్తున్నందుకు
లోకజ్ఞానం కలిగిఉండడం
పిల్లి -కుక్క స్నేహంగా
ఉండడం తో సమానం ..!!

మనిషివై ..మసలుతున్నందుకు
కలసికట్టుగా ..ఉండడం
చీమలన్నీ ..ఐకమత్యంతో
వరసబెట్టి నడవడం తో ..
సమానం ..!!

మనిషివై ..మరణిస్తున్నందుకు
అందరి ..మనస్సుల్లో జీవించడం ...
రాయి శిల్పంగా ..శాశ్వితంగా
విజయ కేతనంగ ..నిలబడ్డం
తో సమానం ..!!

మనిషి "బుధ్ధిజీవి" ..
"ఉత్తమ జీవి" ...!!!?
మనిషి సృష్టి ..మంచి కార్యాలపై ..దృష్టి ..!!!??

మనిషి జన్మ ..
మహా జన్మ ...
కారణ ..జన్మ !!??
🌸🌸🌸🌸🌸🌸🌸🌸

కాదనలేని ..సత్యాలు -32


1. మైకులు ..అదురు తున్నాయి
    పక్షులు ..బెదురు
తున్నాయి
ఉత్తుత్తి హామీల తో ..!!

2. బల్ల మీద ఒక ..చెయ్యి
    దర్జా గా ..
   బల్ల కింద మరో ..చెయ్యి
    మజా గా ..
 లంచాలే ..లంచాలు
 బుట్ట లో ..తాజాగ ..!!

3.అతుకుల ..డ్రస్సులో
 అమ్మయి ..
  సినిమా అంటూ ..
 పెద్ద పాపాయి ..
"హీరోయిన్" అనే పేరు
తరువాయి ..!!??

4. పులి లా ..గాండ్రించే అధికారి ..
    మ్యాఁవ్ మనే పెళ్ళాం
    దగ్గర  పిల్లిలా మారి ..!!

5. పురుగు మందులు ..
   పురుగుల్ని చంపలేక ..
   మనుషులనే ..
   చంపుతున్నాయి ..
   పురుగు ల కంటే ..మనిషే
   బలహీనుడు ..??!!
🌸🌸🌸🌸🌸🌸🌸🌸

కాదన లేని -సత్యాలు -33

1.ఎయిడ్స్ ను పారద్రోలండి కాదు
సురక్షిత కండోమ్ ను ఉపయోగించండి ,
..ఇదీ ఎయిడ్స్ నిర్మూలనా
వ్యవహారం..!!

2.పెళ్ళి సమయం లో ఇచ్చేది
వర కట్నం ..!!
పెళ్ళి తర్వాత ..పుట్టేది పిల్ల కట్నం ..అదే
"అదనపు వరకట్నం"..??!!

3.పేగు బంధం రోడ్డున ..ముళ్ళ
చాటున ..పొదల్లో పడింది ..??
"అక్రమ పుట్టుక "అభాండాలని
బిడ్డని పారేసి ..విసిరేసి ..
పారిపోయింది ..తల్లి అవివాహిత..!!??

4.ముందరేమో ..నేతినిండిన
నీతి మాటలు ..
వెనకేమో ..దుర్నీతి , అవినీతుల..మూటలే మూటలు ..
పిల్లి పాలు త్రాగుతూ ..కళ్ళు
మూసుకుని ..
నన్నెవరూ ..చూడ్డం లేదంటే
...ఇదేనేమో ..??!!
🌸🌸🌸🌸🌸🌸🌸🌸

స్వయం కృతాపరాధం-34

ప్రకృతి కోపించింది ..
ప్రకోపించింది ..
మృత్యువు ను మనిషి వెంట
పరిగెత్తించింది ..??!!

అశ్లీలత ..అసభ్యత  అధికమైంది ..
అన్యాయం ..అక్రమం
వెల్లివిరిసింది ..

పాపాలు ..పెరిగి పోయాయి
పుణ్యాలు ..తరిగి పోయాయి
ఫలితంగా ..
ప్రకృతి  కన్నెర్ర జేసింది ..!!??

మనిషిలో ..ఈర్ష్యా -ద్వేషాలు
పెరిగిపోయాయి ..
మానవత్వం తో ..నుండే
రోషాలు లేకపోయాయి ..
ఫలితంగా
ప్రకృతి ..గంభీరంగా గర్జించింది

స్వార్థ పరత ..స్వాభావికమై
సంతసించింది ...
కుటిల బుధ్ధి , కుయుక్తి, కుట్ర
రాజ్య మేలింది ..??!!
ఫలితంగా ..
ప్రకృతి ..అగ్గి ని కురిపించింది

దొంగతనాలు , దోచుకోవడాలు ,
మోసాలు ..దౌర్జన్యం ..హింస ..
రక్తపాతం ..
ఆగ్రహావేశాలు ..అంతర్యుద్ధం,
అవినీతి -అక్రమాలు , అక్రమ
సంబంధాలు ..యెన్నో యెన్నెన్నో ..సామజిక ఋగ్మతలు ..
ఫలితంగా ..
ప్రకృతి .."ప్రళయం"
సృష్టించింది ..??!!

🌸🌸🌸🌸🌸

శ్రమైక జీవనం -35

కూలి నాలి చేసుకుని ..
బతికే బతుకులు ..మావి
చద్దన్నం ..కారమే రుచి మాకు

బిర్యానీ -బాటిళ్లు ..మేమెరగం
జొన్న సంకటి , రాగి అంబలే
మాకు దిక్కు ..!!
మజ్జిగ , కొబ్బరి బొండాల
పైనే మొగ్గు ..మాకు

కూలు డ్రింకులు , ఫ్రూటీలు
మాకొద్దు ..
ఈత కల్లు వుంటే చాలు ,
తృప్తి గా తాగుతాం ..

కమ్మగ ..నిద్దుర పోతాం ..!!
కలతలు ..లేకుండ ఉంటాం ..!!

పొలం పనులు , హలం పనులు
మా జీవితం ..!!
యెద్దుల ..బండి మాకు
డీజల్ అవసరం లేని కారు
యెప్పుడైనా ..యెక్కడైనా ..
పోతాం ..మా బండి కి
మేమే ..డ్రైవర్లం..!!
పంక్చర్ ల బాధ ..లేదు
ఇంజన్ ఫెయిల్ ..యెదారు లేదు ..??!!!

పంటలు ..పండిస్తాం..!!
సంతోషం గా ..వుంటాం ..!!
కరవు కోరలు ..చాచినా ..
తట్టుకుంటాం..!!

బక్కపల్చగా ..వుంటాం ..!!
బండెడు ..పని చేస్తాం ..!!
కొవ్వుని ..కరిగించి
చెమటని ..చిందించి
పనిచేస్తాం ..!!!?

రేతిరైతే ..హాయిగా ..కమ్మగ
నిద్దరలో ..జారుకుంటాం..!!
ఉన్నదాంతోనే ..సర్దుకుంటాం..!
ఉన్నతంగా ..జీవిస్తాం ..!

శ్రమైక ..జీవనం ..మాది
శ్రమనే ..నమ్ముకుంటాం.మేము
🌸🌸🌸🌸🌸🌸🌸

ప్రియ పరిచయం -36

నీ ..మౌనం లోని రహస్యాన్ని
ఛేదించేదెలా ..?
నీ ..మాట లోని ఆంతర్యాన్ని
విభేదించేదెలా ..?

నీ ప్రతి అడుగు లో ..
యెన్నెన్ని కదలికలో ..?
నీ పాద నాట్యంలో ..
యెన్నెన్ని భంగిమలో ..?

నీ పరువపు ..పలకరింపులే
శృంగార గీతికలు ..!
నీ వలపు ..మోహరింపులే
అంగారమాలికలు ..!

నీ సౌందర్య..సుకుమార నయనాలే ..
వెలుగులు విరజిమ్మే..!!?

నీ ఒళ్ళో ..సాయంత్ర
బంధనాలే ..
మెరుపులు యెగజిమ్మే..!!?

నీ ..సరసం..సహజం ..
సహస్త్రం..సంగమ చరితం ..
నీ ..జననం ..మరణం ..
చరణం ..నీదే సమస్తం ..!!!

నీ దినచర్యం..అమోఘం !
నీ సహచర్యం ..అమూల్యం !

నీకిదే ..నా వందనం ..
ప్రేమానురాగాల చుంబనం ..
ప్రియా ..
నీ అలంకరణ లో ..సంప్రదాయం..!!
నీ కట్టుబొట్టులో
భారతీయం..!!

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

పల్లె ..రేపల్లె -37

పొద్దయింది ..చూడండయా ..
పొద్దయింది ..మా పల్లె లోన ..
రే పల్లెలోన ..!!
వెచ్చని ..నును వెచ్చని ..
సూరీడు కిరణాలు ..!!
తళుకులీనుచుండు ..
బంగారు ఆభరణాలు ..!!

పంట -చేలు , పైర గాలులు ...
పిచ్చుకలు , యెగరడాలు ..ఆహా ..!
యేమి గాలి వీస్తోంది ..
చల్ల గాలి వీస్తోంది ..!!
మా మురిపాల..పల్లె లోన
మా ముద్దులొలికే ..రేపల్లె లోన

చెట్ల పైన పక్షుల ..కిలకిల రావలు ..!!
పొద్దుగాల చెట్లను వీడుతున్నాయి ..చూడు
హాయిగా గాలిలో రెక్కలు
ఊపుతున్నాయి ..చూడు
ఆ విశ్రాంతి యెరగని ..విహంగాలు !!

మరి , యెక్కడి కో ..ఆ
పయనం ..??
మరి , యెక్కడి కో ..ఈ
గమనం ..??
చూడు ..చూడు వాటి
కలివిడితనం ..!!

పల్లె మురిసి పోతోంది ..
మా పల్లె మెరిసి పోతోంది ..

ఉయ్యల ..ఊగింపులు
చింత చెట్లు ..చింత కాయలు
పోరగాళ్ళ ..
దూకుళ్ళు ..దుముకుళ్ళు ..
పిల్ల గాళ్ళ ..నవ్వులు -బోసినవ్వులూ ..

పల్లె ఊగిపోతోంది ..!!
మా పల్లె తూగిపోతోంది ..!!
సంతోషమే ..సంతోషము !!
సంబరమే ..సంబరము !!
మా పల్లెలోన ..రేపల్లెలోన ..
మా పల్లె ..చూడండయా ..
మా "పల్లెఅందం" దర్శించండయా ..!!!
🌸🌸🌸🌸🌸🌸🌸🌸

మాట తప్పడం -38

ప్రాణం పోయినా మాట
తప్పకూడదంటారు ..??
ప్రాణం పోవడం ..
దేవుడెరుగు ..??

మాటనే ..రైలు పట్టాలు
తప్పే తీరుతుంది ..!!
మదిలో , హృదిలో ..నిండు
మోసం గూడు కట్టుకున్నప్పుడు

నమ్మకం..ద్రోహంగా మారి
మనసులో ..దాక్కున్నప్పుడు

అవసరం ..కానీచ్చుకునీ ..
దర్జా గా "పచ్చిమోస" సింహాసనం..అధిష్టించినప్పుడు

నీతి నిజాయతీలే ..ప్రాణంగా
గడిపిన ..ఆ కాలాలు ,
యుగాలెప్పుడో ..కాలగర్భం లో
కలిసి పోయాయి ..!!
నేడు ..అక్కడక్కడ , మచ్చుకు
కొన్ని ..కానవస్తున్నా ..
యెవ్వరినీ ..నమ్మలేని
పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి ..!!?
నేడు "మాట" విషయంలో
హత్యలూ -ఆత్మహత్యలు
చోటుచేసుకుంటున్నాయి -
పుంజుకుంతున్నాయి ..!!!
🌸🌸🌸🌸🌸🌸🌸🌸

మంచితనం ..నీ జాడేక్కడ ?-39

మంచితనం ఒక నాటి గుర్తు గా
మిగిలినట్లు ..అనిపిస్తోంది ..??!
"మంచితనం" మాయmain
లోకమిదీ ..
మచ్చుకైనా ..మానవత్వం
కనిపించని కాలమనిపిస్తోంది ?

యెక్కడ జూసినా ..
వికృతాలు-విడ్డూరాలు ,
వినాశనాలు , విధ్వంసాలు

హింసలు , మానభంగాలు , లైంగిక అమానుషాలు , హత్యలు , అక్రమ సంబంధాలు
ఆత్మహత్యలూ ..

మంచి పనికై..భూతద్దం పెట్టి
వెతికితే ..
నూటికో -కోటికోనన్నట్లుగా ..
"మంచి" ..దర్శనమిస్తోంది ..!!?

అదే చెడ్డ పనులకైతే ..
శోధించాల్సిన ,
అన్వేషించాల్సిన ..అవసరమే
లేకపోతోంది ..??!!

యెందుకంటే -
యెక్కడ జూసినా ..
రక్తమే ..రక్తం?!
యెక్కడ జూసినా ..
రక్త దాహమే ...దాహం ??!!

యెక్కడ జూసినా ..
అభాగ్యుల ..మిన్నంటే రోదనలు ..??!!
ఆవేదనలు ..ఆక్రందనలు
ఆవేశాలు ..ఆగ్రహాలు ..
హింసా -బలాత్కారాలూ ..

"కొని" తెచ్చుకునే ..'మృత్యువు'
"కోరి" తెచ్చుకునే ..జగడాలు ?!
"పరాయివాడు" ..ముక్కూ -
ముఖం తెలియనివాడి ..
చేతిలో ప్రాణం పోయే ..
పరిస్థితులు ..??! ఖర్మ గాక పోతే ..
ఉత్త పుణ్యానికి ..ఊడిపోయేను ..
జీవితం ...????!!!
తమాషా ..చూసేటోడే ..??
కాపాడేవాడు ..యెప్పుడూ
కానరాడు ..?
అందుకే -
మాయమై ..పోతున్నది
మంచితనం ..మానవత్వం ??!!
🌸🌸🌸🌸🌸🌸🌸🌸


[4/23, 5:46 PM] Poet Musthakheem విన్నర్: విజయం -అపజయం -40

విజయ గర్వం ..తో
పొంగి పోకు ..??
ఉప్పొంగి పోకు ..?

అపజయం అగ్ని  ..తో
కృంగి పోకు ..??
అలా ..వంగి పోకు ..?

విజయమైనా ..అపజయమైనా
స్థితప్రజ్ఞ తో ..సమానంగా ..
స్వీకరించు ..!!?

"విజయం" ఒక్క సారి వచ్చి ..
ఒంటరై పోకూడదు ..??!!
ఒక్క విజయం ను తలచి ..
తలచి ..మైమరచి పోకూడదు
విజయం ..సాధించాలి ..
మరిపించాలి ..!!
కొత్త విజయాలెన్నో..యెన్నెన్నో
సాధించాలి ...!!?
విజయ పథం న ...
పయనించాలి ..!!?


అపజయం ..పొందితే
నిరాశ నిస్పృహ ..కలిగితే
అపజయం తో ...అంతా
అయిపోయిందనిపిస్తే ..
అవకాశం ..ఆకాశం ..అంత
యెత్తు లో నుందనిపిస్తే ..

అప'జయం' లోనే ..'జయం'
దాగుందని ..కనిపెట్టలి ..!!?
ప్రేరణ ..పొందాలి ..!!
"అపజయం" ను ..అసహ్యించక ..
"విజయం" నకు ..నాంది గా
స్వీకరించాలి ..??!!
గెలుపోటములు ..ఆటలో
అతి సహజమని ..ఒప్పుకోవాలి ..!?
🌸🌸🌸🌸🌸🌸🌸🌸

అసమానత -41

ఓ ..ఉదయాన ..
నా ..హృదయాన..
ఓ ..విచిత్ర ..సచిత్ర ..
ఆలోచన , ఆవేదన ..
మొగ్గ తొడిగిందిలా ...
నా ..ఆలోచన ..చేపట్టింది
ఓ ..పరిశీలన ..ఓ ..పరిశోధన

అదేమిటంటే ..

ఈ ..లోకంలో చెప్పలేని ,
చిక్కు విప్ప లేని .."శోకం"
నిండి వున్నది ..??!
కోట్లకు ..కోట్లు సమకూర్చుకుని
కోట్లకు ..పడగలేత్తీన వాడు ..
అన్ని సౌకర్యాలు ..విలాసాలూ
దేనికీ ..కొదవలేని ..బ్రతుకును
వెళ్ళదీయలేక ..జీవితానందం
కొరవడి ..విరక్తి తో ..చస్తున్నాడు ..??!!!

మరో వైపు ..
కడు దారిద్ర్యం లో ..
మునిగి తేలే .."బీదజనుడు"
తిండీ -గింజ లేక ..
నిలువ నీడ లేక ..
యెవ్వరూ ఆదుకునక ..
అనారోగ్యం ..బారిన పడుతూ
అవస్థలే ..అవస్థలు యెదుర్కొం
టూ ..
బ్రతుకు భారం తో , కుటుంబ
భారం తో ..చస్తున్నాడు ..??!!

ఆలోచన రేపేది -

ఒకడికి ..తిండీ-సౌకర్యాలు
యెక్కువైతే ..?
మరొకడికి ..తిండీ -సౌకర్యాలు
కరవైతే ..?

ఉన్నోడు ఉన్నదంతా ..
"ఉరి" కి ..అందిస్తూ ..?????
లేనోడు ..దేహాన్నంతా ..
"ఊరి" కి ..అర్పిస్తూ ..?????

సామాజిక న్యాయం , సమానత్వం ,
మార్క్సిజం ...వంటి
సిధ్ధాంతాలన్నీ ..రాధ్ధాంతాలై ..
వెక్కిరిస్తున్నాయి ..??!!

వాస్తవంగా జరుగుతున్నదేమి?

ఉన్నోడు ..ఉన్నట్లు గానే ..
చస్తున్నాడు ..!!??
లేనోడూ ..లేనట్లు గానే ..
చస్తున్నాడు ..!!??
అంటూ ..వెటకారంగా ..
నవ్వుతున్నాయీ ..నా మది లోని ..భావాలు -ఆలోచనలు !!

ఔనన లేక ..కాదన లేక ..
అర్థం గాక ..విస్మయం తో ..
మిన్నకుండి పోయాను ..నేను !

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

పూదోట -42


పూదోట లో -
పూలు ..పూశాయి
పరిమళాలు వెదజల్లాయి ..!!
తోటంతా గుబాళింపులు ..!
గువ్వల ..గుసగుసలు ..!

తుమ్మెదల ..తూనీగల ..
సవ్వడులు , సరాగాలు ..!!
తుమ్మెదల ..తియ్యని పాటలు
తూనీగల ..కూని కూని రాగాలు

ఈ ..వర్ణించ జాలని..
ఆహ్లాదానికి , ఆనందానికీ , అద్భుతానికి ....
ప్రతి ..తరువు దాని శాఖలూ
పరవశించాయి ..!!
స్వర్గ మెక్కడో లేదు ..
ఇక్కడే వుందని తలిచాయి ..!!

గువ్వా -గోరింకల..
దోబూచులాటలు ...!!
చల్లని గాలిలో ..
పూదోటల ..ఆనంద పరవళ్ళు.!
యెక్కడ జూసినా ..
ప్రకృతి రాణి ..పట్టరాని పకపకలూ ..!

తేనె తీగల ..వరస కట్టడాలు ..!!
సీతాకోక చిలుకల ..యెగరడాలు ..!!

పులకించి పోయే ..పూలు !
ఒలికించి పోయే ..మరందాలు !!
భూమాత సయితం ..
తహ తహ లాడుతోంది ..!!!
మరంద -మకరంద బిందువు
ఒక్కటైనా ..దక్కించుకోవాలని
చీమల దండు ..ఇంకో వైపు
కలసికట్టు ..దండయాత్ర ..తీపి
మకరందం ..కోసం ..!!?

పూదోట ..పూర్తిగా ..
స్వేచ్ఛ కోల్పోయింది ..??

ఐనా -
తనలో ..తాను నవ్వుకుంది ..
పరిస్థితి ..చేజారిందని ..!!??

పూదోట ..పూట ఇలా ..
గడుస్తోంది ...!!?
🌸🌸🌸🌸🌸🌸🌸🌸

దొంగ బతుకు -43

కష్టపడని తత్త్వం..
పరులను పీడించడం ..
అక్రమ జీవితం ..
అన్యాయ పూరితం ..
దొంగ జీవితం ..దౌర్జన్య జీవితం
సజ్జనులందరూ ..ఖండించే మాట ..??!!

సమాజం ..హర్షించనైనా ..
హర్షించని ..సమర్థించని ..పని
"మోసం" .."దొంగతనం"..!!??

"థూ" ..అంటూ ఉమ్మే పరిస్థితి ..దొంగతనం ..?!
దేహ శుధ్ధి బతుకు ..
దొంగ బతుకు ..!!?
లాఠీలు ..విరుగు..!!
బతుకు ..చెరుగు..!!

దొంగ తనం ..అసాంఘికం!
దొంగ జీవితం ..అనైతికం !!
దొంగ తనం ..నేరం -ఘోరం ..??
కడు పాపం ..నరక ప్రాయం !

దొంగ గా ..బతికే బతుకు
సమాజాన..విలువ లేని..
నిలువ లేని ..వృథా బ్రతుకు ..!
దొంగ బతుకు ..సామాజిక
బహిష్కరణ ..బతుకు ..??
దొంగ బతుకు ..లాంగ బతుకు,
దొంగ బతుకు ..వెధవ బతుకు?

శ్రమ జేసి ..చెమటోడ్చిన ...
బ్రతుకే బ్రతుకు ..పరమాన్నం
బ్రతుకు ..??!!

శ్రమ జీవనం లోని ..ఆనందం
శ్రమించేవాడికే ..తెలుస్తుంది..?!

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸



.పూట కూళ్ళు -44

గోరు ముద్దలను ..
తినిపించిన అమ్మను ..
కష్టపడి పెంచిన ..
పోషించిన నాన్నను ..
ముసలితనం ..లో
వాళ్ళ మంచి చెడ్డలకై ..
తిండి -తిప్పలు , పోషణ కై ..
"ఉదయం , మధ్యహ్నం , రాత్రి"
భోజనాలంటూ ..
ఒక ..నెల నీవూ ..
ఒక ..నెల నేనూ ..
అంటూ ..భాగాలు - వాటాలు
పంచుకుంటున్నారు ..
చిట్టి తండ్రులు .."తనయులు"


యేమిటీ ..దౌర్భాగ్యం ..?
యెందుకీ ..వైపరీత్యం ..?
అమ్మా నాన్నలంటే ..పరాయితనం ..?

పూట కూళ్ళ తో ..వారి
జీవితాలను ..
విభజించటం , విస్మరించడం
ఆ ..దేవుడు సయితం
భరించడు ..క్షమించడు ..??

అమ్మా నాన్న ..లేనిదే నీవు లేవు ..??!!
నీ ..ఆద్యులకు ..
నీ ..ఆరాధ్యులకు ..
ఇలా ..చేయడం ..
వ్యవహరించడం ..
అన్యాయం ..
అసమంజసం ..
అసమర్థనీయం..???!!!

ఇదంతా ..చూస్తున్న ..నీ
పిల్లలు ..
నీకు కూడ ఇదే గతి పట్టిస్తారు
జాగ్రత్త ..సుమా ..!!??

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

బంగళా..బతుకులు -45

బంగళా లో ..సకల సదుపాయాలున్నా ..
నిదుర ..లేని జీవితాలు ..!!?
వెలుగు చూసే నిజాలు ..!!??

సుఖ -సంతోషాలు యెరగని
బ్రతుకులు ..!!
యెప్పుడూ ..చికెన్ , మటన్
బిర్యానీ..మెతుకులు ..!!

భారీ కాయం తో ..రోగాల తో ..
సతమతం ..జీవితం ..!!
త్రాగుళ్ళు ..తూలడాలు ..
పోలీస్ స్టేషన్ లలో ..కేసులే
కేసులు ..??!!

విచ్చలవిడి..వ్యవహారం..
జీవితం ..ఇఛ్ఛానుసారం ..
జీవితం ..!!??

వ్యక్తిత్వ లోపాలు..విచిత్ర
మనస్తత్వాలు..!!
బడా బాబుల..బతుకులు
మోసాలే ..మోసాలు ...!!
చింపిరి ..యెంగిలి విస్తరాకులు
గోల పెట్టే ..కాకులు ..!!

కార్ల ..తోలడాలు ..
యెవర్నో ..ఒకరిని ..గుద్దడాలూ
ప్రాణం ..పోవడాలు
కోర్టు చుట్టూ ..తిరగడాలు ..!!??

బంగళా ..బతుకుల కన్నా ..!
పూరిల్ల ..జీవితాలే మిన్న ..!!
ఉన్న కాడికి ..తిన్నా
తృప్తి ..నిండిన బతుకన్న
కళ్ళ ..నిండా ..నిద్దుర
మది ..నిండా ..సంతోషం గదరా

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

ముసలితనం -46

ముసలితనం ..యెనలేని అనుభవాల..మేఘాలమయం
ఒక్కొక్క ..సారవి
దుఃఖ సాగరాలై ...వర్షిస్తే ..
ఒక్కొక సారవి
ఆనంద భాష్పాలై ..కురిస్తే ..
మది లోతుల్లోకి ..జ్ఞాపకాల
తెరలు ..తెరిస్తే ..

ముసలితనం  ..కప్పుకున్నదీ ..
దేహం ..!!
చెప్పలేని ..బాదరబందీ యెదుర్కొన్నదీ ..దేహం !!

ఒకప్పుడు ..యౌవనకాలం లో
కష్టాల కడగండ్లను ..
తట్టుకున్నదీ ..ముసలితనం !!
పనినే దైవంగా తలచి ..
ఒళ్ళు గుల్ల చేసుకున్నదీ ..
ముసలితనం !!
ఆ సమయాన -
స్వేద బిందువు లో అపార
శక్తి ..నిండుకున్న కాలం ..!!
కండరాల బిగింపులు ..
పనిలో తెగింపులు ..
కష్టాలతో ..కౌగిలింతలు ..
విరామమెరుగని ..సమయ
పాలింపులూ ..!!!

యౌవనమంతా ..వృత్తిలో
కుటుంబ పోషణ లో ..!!
కొవ్వత్తి లా..కరిగితే చివర కు
మిగిలినదే .."ముసలితనం"
గత జ్ఞాపకాల్తో ..నిండినదే ..
ఈ  ముసలితనం ..వృధ్ధ జీవితం ..!!
ఛీదరించుకునేది కాదు ..
ముసలితనం ..అక్కున
చేర్చుకోతగినది ..!!!??

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

తెలుగు భాష గొప్పదనం -47


తేనె తీపి నిండినదీ ..
తెలుగు భాష ...!
మధుర మైనదీ ..
తెలుగు భాష ..!
సుమధుర మైనదీ ..
తెలుగు భాష ..!


విరిసే వెన్నెలైనదీ ..
తెలుగు భాష ..!
కురిసే చినుకైనదీ ..
తెలుగు భాష ..!
విశిష్టమైనదీ ..
తెలుగు భాష ..!
విలక్షణమైనదీ ..
తెలుగు భాష ..!

కవుల ..కలమైనదీ ...
తెలుగు భాష ..!
కళాకారుల ..గళమైనదీ ..
తెలుగు భాష ..!
"సాహితీ సేద్య"మైనదీ ..
తెలుగు భాష ..!
రచనల తో రంగేస్తున్నదీ ..
తెలుగు భాష ..!


చారిత్రకతనూ ..చాటుతున్నదీ
తెలుగు భాష ..!
సంస్కృతీ -సంప్రదాయాలదీ ..
తెలుగు భాష ..!
నన్నయ -తిక్కన-యెర్రన ..
లకు ఇష్టమైనదీ ..
తెలుగు భాష ..!
అందమైనది, అనుబంధాలున్నదీ ..
తెలుగు భాష ..!

పలకరింపుల తో ..పల్లవించినదీ ..
తెలుగు భాష ..!
తెలుగు ప్రజలకు తోడూ -నీడైనదీ ..
తెలుగు భాష ..!
సహజ మైనది, సరళ మైనది ,
హృద్యమైనదీ ..
తేనె ..లొలుకు ..మన
"తెలుగు భాష"..!!!

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

రంగు -రూపు -48

మనుష్యుల ..ముఖాలు
దేవుని ..సృష్టితాలు ..!
పేర్లు పెట్టొద్దు , తెల్లనని ..నల్లననీ ...

ముఖం ..కాదు
మదిని తెరచి చూడాలి ..!
మనసులోని ..మంచిని
తరచి -తరచి చూడాలి ..!
దైహిక రూపం గాదు ..
మానసిక సౌందర్యం ..కావాలి.!
చర్మం ..రంగుని , కాదు
చేసే ..పనులు చూడాలి ..!

రూపం ..దేవుడు సృష్టించాడు !
ఆ ..దేవుడు అందరినీ ..
పుట్టించాడు ..!!
ఒకరి ..రంగూ-రూపం నీ
వెక్కిరించడమంటే ..?
ఆ ..దేవుణ్ణి ..అవమానించినట్లే
దేవుణ్ణి దూషించడం..
పాప కార్యమే ..!!?


మనిషి ..అంతరంగమే ..
అసలైన రంగు-రూపం !!
మనిషి వ్యక్తిత్వమే ..
సిసలైన ..రూపలావణ్యం ..!!

నల్లరంగు వాడు పెద్ద హోదా
వాడై ..వుండొచ్చు ..!!?
తెల్లరంగు వాడు చిన్న ఉద్యోగై
ఉండొచ్చు ..!!?

తెల్లవాడి గుణం..నల్లదై ఉండొచ్చు ..!
నల్లవాడి గుణం ..తెల్లదై
ఉండొచ్చు ..!

అందుకే -
రంగు కాదు ..ముఖ్యం !
రూపం కాదు ..ముఖ్యం !
"మనసు" -ముఖ్యం !!!

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

ప్రేమ-ద్వేషం -49


ప్రేమించడం ...
మర్చిపోయాడు  మనిషి !
ద్వేషించడం ..
నేర్చు కున్నాడు మనిషి !

కలసి -మెలసి ...జీవించడం
గత కాలపు గుర్తయినది .!!
చంపడం ..చంపుకునడం ..
నేటి కాలపు రివాజయినది ..!!


మాటలాడని ..కాలమొచ్చింది !
మాటపడని ..కాల మొచ్చింది !
ఘర్షణలు -సంఘర్షణలు ..
కావాలి ..!!
పట్టింపులు -పంతాలు ..
కావాలి ..!!

ఆనంద జీవితం ..వద్దు ..!!?
కొట్లాటలూ -కలహాలే ముద్దు.!?
సర్దుబాటు..లేకనే ఈ సమస్యలు ..??!!
సామరస్యం ..లేకనే ఈ
సంఘర్షణలు ..??!!

సంకుచిత మనస్తత్వమే ..
వీడాలి ..!
విశాల హృదయమే ..
కావాలి ..!
చేతులు కలుపు కునాలి ..!!
స్నేహమే ..వెల్లి విరియాలి ..!!
నలు ..దిశలూ పరవశించాలి!!
నవ్వుల..పువ్వులే ..పూయాలి!

ప్రేమించడం ..నేర్చుకోవాలి
మనిషి ..!?
ద్వేషించడం ..మర్చిపోవాలి
మనిషి ..!?
అప్పుడే ..సత్సమాజం!
అప్పుడే ..సత్కాలం!

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

తస్మాత్ జాగ్రత్త -50


యెవడో ..ముక్కూ ముఖం
తెలియని వాడు ..
సాయం చేస్తానంటాడు ..!
ముందు కొస్తాడు ..!

ముఖం లో ..చిరునవ్వు  ఉంటుంది ..!
మనిషి కూడ చూడ్డానికి ..
మంచివాడి లా ..కనిపిస్తాడు..!

లోన ..కనపడని కపట ముంటుంది ..??!!
ఇది తెలియని ..తెలుసుకోలేని
ఆడపిల్లలు , అమ్మాయిలూ ..
భ్రమ ..పడతారు ..?!!

వాడి మోసాన్ని ..పసిగట్టలేక
పోతారు ..??!!
వాడు పన్నిన పన్నాగం నూ ..
గుర్తించ లేక పోతారు ..!!

తెలిసీ తెలియని తనం..తో
అమాయకత్వం ..తో
మూర్ఖత్వం ..తో

త్వరగా ..ఇంటికెళ్ళి పోవాలన్న
తొందర పాటు ...తో
ఆలోచనా రహితంగా  "వల" లో ..పడిపోతారు ??!!

ఘోరం ..నేరం ..జరిగిందంటూ
గగ్గోలు ..పెడ్తరు ..??!!

ఆడ పిల్లలూ ..అమ్మాయిలు ..
మహిళలూ ..
"కొత్త మనుషుల తో ..
జాగ్రత్త ..తస్మాత్ జాగ్రత్త "..!!
ఆలోచన తో ..
వివేచన  తో ..
విజ్ఞత తో ..మసలండి ..జీవించండి..!

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸